
Trump Modi Phone Call News IN – US ట్రంప్ – మోదీ ఫోన్ కాల్.. “స్టే ట్యూన్” అన్న అమెరికా రాయబారి
భారత్–అమెరికా సంబంధాల్లో మళ్లీ హాట్ టాపిక్ వచ్చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడినట్టు అమెరికా రాయబారి సెర్జియో గోర్ అధికారికంగా చెప్పాడు. అయితే ఈ కాల్లో ఏం మాట్లాడారో మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేదు.
Read more Budget 2026 Crypto Tax Unchanged: Industry Disappointed Over Missed Reforms
ఈ విషయాన్ని మీడియా అడిగితే, సెర్జియో గోర్ ఒక్క మాటే అన్నాడు –“స్టే ట్యూన్” అంటే త్వరలోనే పెద్ద అప్డేట్ రావచ్చని క్లియర్‌గా హింట్ ఇచ్చినట్టే.
ఇప్పుడు ఈ మాటతోనే దేశ రాజకీయాల్లో, అంతర్జాతీయ వర్గాల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ట్రంప్ – మోదీ మధ్య జరిగిన ఈ సంభాషణలో వాణిజ్యం, భద్రత, గ్లోబల్ రాజకీయాలు, ఇండో-పసిఫిక్ వ్యూహం లాంటి కీలక అంశాలపై చర్చ జరిగి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే భారత్–అమెరికా సంబంధాలు స్ట్రాంగ్‌గా ఉన్న టైమ్‌లో ఈ ఫోన్ కాల్ రావడం విశేషం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారుతున్న సమయంలో, ఈ సంభాషణకు మరింత ప్రాధాన్యం దక్కుతోంది.
ఇంకా అసలు మ్యాటర్ బయటకు రాలేదుగానీ, అమెరికా రాయబారి ఇచ్చిన “స్టే ట్యూన్” స్టేట్మెంట్ చూస్తే మాత్రం…
ఇంకేదో పెద్ద విషయం ఉందని మాత్రం అర్థమవుతోంది.
ఈ కాల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రాబోయే రోజుల్లో అధికారికంగా వెల్లడి అయ్యే ఛాన్స్ ఉందని అంతా అనుకుంటున్నారు.
- Oracle Analyst Recruitment 2026 | Freshers Eligible | Apply Now
- Emirates Suspends Dubai Flight Operations Amid Israel–Iran Airspace Disruptions
- Iran Israel War 2026 :Why Iran and Israel Conflict Started?
- Deloitte Financial Accounts Intern Hiring 2026 – Bengaluru | Freshers & Final Year Students
- ION Group Off Campus Drive 2026 – Freshers Hiring Software Engineers | Salary Up to ₹7.5 LPA


